ఎన్​సీసీతో డిసిప్లిన్, నాయకత్వ లక్షణాలు : వివేక్ వెంకటస్వామి

ఎన్​సీసీతో డిసిప్లిన్, నాయకత్వ లక్షణాలు : వివేక్ వెంకటస్వామి

ఎన్​సీసీతో డిసిప్లిన్, నాయకత్వ లక్షణాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

ముషీరాబాద్, వెలుగు : ఎన్​సీసీలో చేరడం ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు గొప్ప వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవచ్చని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్ చైర్మన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సోమవారం బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఎన్సీసీ క్యాడెట్లకు ర్యాంక్ ప్రమోషన్స్ కార్యక్రమం జరిగింది. 

దీనికి వివేక్ చీఫ్ గెస్ట్​గా హాజరై ప్రతిభ కనబర్చిన స్టూడెంట్లకు ర్యాంకులను అందజేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ శక్తిమంతమైన ఆయుధమని అన్నారు. స్టూడెంట్లు బాగా చదువుకొని కలలను నెరవేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్​స్టిట్యూషన్స్ ఫ్యాకల్టీ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.