అన్నదమ్ముల అనుబంధానికి  ఒక వేడుక..బ్రదర్స్ డే

అన్నదమ్ముల అనుబంధానికి  ఒక వేడుక..బ్రదర్స్ డే

రాఖీ పండుగ అంటే అక్కాతమ్ముళ్లు , అన్నా చెల్లెల్ల  అనుబంధానికి ప్రతీక.  ఇక అన్నాతమ్ముళ్ల మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా ఒక రోజు ఉంది. అదే.. మే నెల 24వ తేదీ. 2005 సంవత్సరం నుంచే దీన్ని చాలా దేశాల్లో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తొలిసారిగా అమెరికాలోని అలబామా నగరానికి చెందిన సి.డేనియల్ రోడ్స్ అనే వ్యక్తి దీన్ని వేడుకగా జరుపుకున్నాడు. నాటి నుంచి ఆ ట్రెండ్ అమెరికా నుంచి మొదలుకొని  పలు ఐరోపా దేశాలకు కూడా విస్తరించింది. తోబుట్టువులు మాత్రమే కాకుండా.. బాబాయి పిల్లలు, పెదనాన్న పిల్లలు కూడా ఈసందర్భంగా ఒకచోటుకు చేరి పరస్పరం ‘బ్రదర్స్ డే’ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈనేపథ్యంలో మే 24న (మంగళవారం) అమెరికాలోని పలు నగరాల్లో ఘనంగా బ్రదర్స్ డే వేడుకలు జరిగాయి. అక్కడి సోషల్  మీడియాలోనూ ‘బ్రదర్స్ డే’ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. అన్నతమ్ములు తమ అనుబంధానికి అద్దం పట్టే ఫొటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. ఇందుకు సంబంధించిన శుభాకాంక్షలతో కూడిన పోస్టర్లు, వాల్ పేపర్లు, స్టిక్కర్లు, మెసేజ్ లు, సూక్తులు, వాట్సాప్ స్టేటస్ లు విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు.. 

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు

వరుడి బట్టతల చూసి వధువు షాక్.. ఆగిన పెళ్లి