బ్లడ్​ డోనేషన్​ క్యాంప్స్​కు విశేష స్పందన

బ్లడ్​ డోనేషన్​ క్యాంప్స్​కు విశేష స్పందన

ఖైరతాబాద్/పద్మారావునగర్/వికారాబాద్,వెలుగు : వరల్డ్​బ్లడ్​డోనర్స్​డే సందర్భంగా శుక్రవారం గ్రేటర్​పరిధిలోని హాస్పిటళ్లలో బ్లడ్​డొనేషన్​క్యాంపులు నిర్వహించారు. చాలా మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్త దానం చేశారు. సోమాజిగూడలోని రాజ్​భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాలులో రాజ్ భవన్, ఇండియన్ ​రెడ్​ క్రాస్ ​సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్​డొనేషన్​క్యాంప్​ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రారంభించారు. మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చని తెలిపారు. జిల్లాల్లోని 100 బెడ్ల​హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంక్​ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

జహీరాబాద్​ఎంపీ సురేశ్​షెట్కార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రెడ్​క్రాస్​ సొసైటీ చైర్మన్ అజయ్ విశ్రా, సీఈవో మధన్​ మోహన్, రాజ్​భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హెల్త్​ప్రిన్సిపల్​సెక్రటరీ క్రిస్టినా జెడ్​ చోంగ్తూ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గాంధీ హాస్పిటల్​బ్లడ్​సెంటర్ ఆధ్వర్యంలో హాస్పిటల్​తోపాటు మరో మూడు చోట్ల బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహించారు. 146 యూనిట్ల బ్లడ్​ను సేకరించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు తెలిపారు.

వికారాబాద్​జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసులో బ్లడ్​డొనేషన్​క్యాంప్​నిర్వహించారు. వికారాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ పాల్వన్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. నిమ్స్​బ్లడ్ సెంటర్​లో నిర్వహించిన క్యాంపులో నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.బీరప్ప, బ్లడ్​బ్యాంక్​హెచ్ఓడీ శాంతి పాల్గొని ప్రారంభించారు. హాస్పిటల్​స్టాఫ్ తోపాటు పలువురు యువకులు రక్త దానం చేశారు.