అంబేద్కర్​ కాలేజీలో జాబ్​మేళాకు భారీ స్పందన

అంబేద్కర్​ కాలేజీలో జాబ్​మేళాకు భారీ స్పందన
  • పాల్గొన్న 24 కంపెనీల ప్రతినిధులు 
  • విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందం

ముషీరాబాద్,వెలుగు: అంబేద్కర్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన వచ్చింది. ఉద్యోగ కల్పనలో భాగంగా 24 ప్రైవేటు కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి.  కాలేజీ సెక్రటరీ గడ్డం వినోద్, డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు హాజరై ప్రారంభించారు. కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ చదివే సుమారు 600 మంది స్టూడెంట్లతో పాటు ఇతర కాలేజీల స్టూడెంట్లు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, వినెక్స్ట్, శ్రీరామ్, వీ6, మహేంద్ర ఫైనాన్స్, హెటిరో,  వెలుగు తదితర కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు స్టూడెంట్లతో ఇంటర్య్వూలు నిర్వహించారు. భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలపై ప్రశ్నలు వేస్తూ వారి ప్రతిభను గుర్తించారు. కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ కాలేజీలో జాబ్​మేళా నిర్వహిస్తే స్టూడెంట్లు తమకు నచ్చిన కంపెనీని సెలక్ట్ చేసుకునే  అవకాశం ఉంటుందన్నారు. జాబ్ మేళాలు నిర్వహించకపోవడంతో స్టూడెంట్లు చదువు పూర్తయినా జాబ్ సెర్చ్​లో ఉండి సరైన కంపెనీని సెలక్ట్ చేసుకోలేక టైమ్ వృథా చేసుకుంటారన్నారు.స్టూడెంట్లు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంబేద్కర్ ​కాలేజీ స్టూడెంట్లు మాట్లాడుతూ జాబ్​ల కోసం తాము కంపెనీల చుట్టూ తిరగకుండా..  కాలేజీలోనే  మెగా జాబ్ మేళా నిర్వహించడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరిగిందన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల అడ్మిన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, హెచ్ఆర్ పవన్, అకౌంట్ఆఫీసర్ అమిత్ సింగ్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వేదాంతం రవి, ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజ, లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సృజన, స్కూల్ ప్రిన్సిపల్ విఠలాచారి, జాబ్ మేళా కన్వీనర్ మజీద్, స్టూడెంట్లు, పేరెంట్స్ పాల్గొన్నారు.  అంబేద్కర్ కాలేజీ ఎన్​సీసీ స్టూడెంట్లు డ్రగ్స్​తో  కలిగే అనర్థాలను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ సుందరయ్య పార్క్, బాగ్ లింగంపల్లి వరకు ర్యాలీ తీశారు. డగ్స్  కు.. ధూమపానానికి బానిసలుగా మారి.. కుటుంబాలకు అన్యాయం చేయొద్దంటూ నినాదాలు చేశారు.