- అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేసేలా వ్యవస్థ
హైదరాబాద్‌సిటీ,వెలుగు :
వాటర్‌బోర్డు పరిధిని ఔటర్ వరకూ విస్తరించడంతో ఆయా ఏరియాలకు పక్కా ప్లాన్ప్రకారం నీటి సరఫరా చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని కోసం ‘వాటర్మాస్టర్ప్లాన్’ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్‌పరిధిలో సీవరేజీ మాస్టర్ప్లాన్కోసం ప్రణాళిక రూపొందించిన అధికారులు తాజాగా నీటి సరఫరా పక్కాగా ఉండేందుకు మాస్టర్ప్లాన్కూడా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్లు అన్నీ నిజాం కాలం నాటివి కావడం, మారుతున్న కాలానికి, పెరుగుతున్న నీటి అవసరాలకు అనుగుణంగా వాటర్లైన్లు లేకపోవడంతో నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు బోర్డు 1450 చ. కి.మీ. పరిధిలో తాగునీటి సరఫరా చేస్తోంది. ఈ నెట్వర్క్ఒక ప్లాన్ప్రకారం లేదు. ఇంతకాలం ఏ ప్రాంతంలో నీటి డిమాండ్ఉంటే ఆ ప్రాంతాల్లో పైపు లైన్లు వేసుకుంటూ పోయారు. ఇందులో కొన్ని ప్రాంతాలకు సరైన పైప్లైన్వ్యవస్థ లేదు.
దీంతో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా సాఫీగా జరిగితే మరికొన్ని చోట్ల లీకేజీలు, పాత లైన్ల కారణంగా ప్రెషర్తక్కువగా వెళ్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. తాజాగా బోర్డు పరిధిని ఔటర్వరకు విస్తరించడంతో 2050 చ. కి.మీ. వరకూ పెరిగింది. ఈ ప్రాంతాలన్నింటినీ కవర్ చేయాలంటే కొత్త వాటర్లైన్లు వేయాల్సిన అవసరం ఉందని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి భావిస్తున్నారు. అందుకే మాస్టర్ప్లాన్ప్రకారం పైప్‌లైన్ నెట్వర్క్అమలు చేయాలని అనుకుంటున్నారు.
ప్లాన్ ఇలా..
వాటర్‌బోర్డు మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రాంతంలో వాటర్లైన్స్ఎలా ఉండాలి? ఎక్కడెక్కడ రిజర్వాయర్లను నిర్మించాలి అన్న విషయాలను పొందుపరుస్తున్నారు. ఈ మాస్టర్‌ప్లాన్ డీపీఆర్తయారీకి ప్రైవేట్ ఏజెన్సీని నియమించనున్నారు. ఎక్స్ప్రెషన్ఆఫ్ఇంట్రెస్ట్ద్వారా టెండర్లను పిలిచి పనులు అప్పగించాలని నిర్ణయించారు. 2047 అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాస్టర్‌ప్లాన్ రూపొందించబోతున్నారు.
