కోఠి నుంచి కొండాపూర్​కు.. కొత్తగా ఏసీ బస్ సర్వీసులు

కోఠి నుంచి కొండాపూర్​కు.. కొత్తగా ఏసీ బస్ సర్వీసులు

హైదరాబాద్, వెలుగు: ఐటీ, ఇతర ఉద్యోగుల కోసం గ్రేటర్​ఆర్టీసీ అధికారులు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. 127కె రూట్(కోఠి నుంచి కొండాపూర్)​లో సోమవారం నుంచి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్​సర్వీసును స్టార్ట్​చేసినట్లు గ్రేటర్​హైదరాబాద్​జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5.06 గంటలకు కొండాపూర్​నుంచి కోఠికి, ఉదయం 6.16 గంటలకు కోఠి నుంచి కొండాపూర్​కు ఈ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించారు.

 కొండాపూర్​నుంచి రాత్రి 10.17 గంటలకు, కోఠి నుంచి రాత్రి 11.27 గంటలకు ఆఖరి బస్సులు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ఈ సర్వీస్​కోసం మొత్తం ఆరు ఏసీ ఎలక్ట్రిక్​బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. కోఠి, లక్డీకాపూల్, మాసాబ్ టాంక్​, పెద్దమ్మ తల్లి టెంపుల్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొత్తగూడ క్రాస్​రోడ్స్, కొండాపూర్​రూట్​లో నడుస్తామని, ఈ రూట్​లో జర్నీ చేసే ఐటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు.