గ్రేటర్వరంగల్, వెలుగు: నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను వ్యూహాలతో జయించాలని సైక్రియాటిస్ట్ డాక్టర్ రవిచంద్ర అన్నారు. గ్రైటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ కాకతీయ చాప్టర్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డికాలనీలో బుధవారం ‘ఒత్తిడి నిర్వహణ’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవిచంద్ర ప్రాక్టికల్ టిప్స్, మెడిటేషన్ మెలుకువలు, జీవనశైలి మార్పులు తదితర అంశాల పై వివరించారు. ఇలాంటి కార్యక్రమం బిజినెస్ లీడర్స్ మధ్య మానసిక ఆరోగ్య అవగాహనను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా 2026 డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో చాప్టర్ చైర్మన్ ప్రభూ కిరణ్, వైస్ చైర్మన్ బొడ్ల రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
