కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: బయోగ్యాస్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా హెడ్ఆఫీస్ఆవరణలోని బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ను మేయర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ప్లాంట్ సామర్ధ్యాన్ని 2 టన్నులకు పెంచాలని మేయర్ అధికారులను ఆదేశించారు.
అనంతరం వందేమాతరం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయంలో గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ వో రాజారెడ్డి, ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
