టీకా వేసుకుంటే రూ.13 వేలు

టీకా వేసుకుంటే రూ.13 వేలు

ఏథెన్స్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు గ్రీస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీకాలు వేసుకునే యువతకు రూ.13 వేలు అందజేస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని డిజిటల్ వ్యాలెట్ రూపంలో ఇస్తామని తెలలిపింది. 26 ఏండ్ల లోపు వాళ్లకు ఇది వర్తిస్తుందని, జులై 15 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని కైరికోస్ మిత్సోటాకీస్ సోమవారం తెలిపారు. ఈ డిజిటల్ మనీతో టూరిజం, ఎంటర్ టైన్ మెంట్ సేవలు పొందొచ్చని చెప్పారు. విమాన, రైల్వే టికెట్లు కొనుక్కోవచ్చని, కారు అద్దెకు తీసుకోవచ్చని, ట్రావెల్, థియేటర్ సర్వీసులు, టూరిస్ట్ ప్లేసులలో రూమ్స్ పొందొచ్చని, మ్యూజియాలు, ఆర్కియాలాజికల్ సైట్లను విజిట్​ చేయొచ్చన్నారు.