Wimbledon 2025: తృటిలో తప్పిన సంచలనం.. చాతి నొప్పితో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన స్టార్ ప్లేయర్

Wimbledon 2025: తృటిలో తప్పిన సంచలనం..  చాతి నొప్పితో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన స్టార్ ప్లేయర్

ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025లో ఊహించని సంఘటన ఒకటి టెన్నిస్ ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తుంది. నాలుగో రౌండ్ లో భాగంగా  సోమవారం (జూలై 7) ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ తో గ్రిగర్ డిమిట్రోవ్ మధ్య జరిగింది. మ్యాచ్ కు ముందు వరకు సిన్నర్ ఫేవరేట్. అయితే మ్యాచ్ ఓరారంభమైన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. డిమిట్రోవ్ తన అనుభవాన్ని ఉపయోగించి తొలి సెట్ ను 6-3 తో గెలుచుకున్నాడు. ఇదే ఊపులో సిన్నర్ పై రెండో సెట్ లో కూడా ఆధిపత్యం చూపిస్తూ 7-5 రెండో సెట్ గెలిచాడు. మూడో సెట్ లో 2-2 వద్ద ఉన్నప్పుడు డిమిట్రోవ్ తన సర్వీస్ లో చాతి నొప్పితో ఇబ్బందిపడ్డారు. 

వైద్య సిబ్బందిని వెంటనే వచ్చి అతనికి చికిత్స అందించారు. ఈ క్రమంలో డిమిట్రోవ్ ఏడుస్తూ ఉండడం స్టేడియంలో ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. కుడి ఛాతీలో విపరీతమైన నొప్పి రావడంతో మ్యాచ్ కొనసాగించలేకపోయాడు. అప్పటివరకు 34 ఏళ్ల డిమిట్రోవ్ అత్యుత్తమ టెన్నిస్ ఆడినప్పటికీ అనూహ్యంగా జరిగిన ఈ సంఘటన కారణంగా మ్యాచ్ వదిలేసి వెళ్ళిపోయాడు. గత కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న ఈ వెటరన్ ప్లేయర్..మరోసారి ఫిట్ నెస్ కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. 

ALSO READ : జింబాబ్వేతో టెస్ట్ సిరీస్.. న్యూజిలాండ్ జట్టులో విలియంసన్‌కు నో ఛాన్స్

డిమిట్రోవ్ మ్యాచ్ మధ్యలోనే వైదొలగడంతో సిన్నర్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో సిన్నర్ అమెరికాకు చెందిన 10వ సీడ్ బెన్ షెల్టన్‌తో తలపడనున్నాడు. సిన్నర్ కు ఇది వరుసగా ఏడో గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్. మెన్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ఆరోసీడ్‌‌ జొకోవిచ్‌‌ 1–6, 6–4, 6–4, 6–4తో అలెక్స్‌‌ డి మినుయెర్‌‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌‌లోకి ప్రవేశించాడు.మరో మ్యాచ్‌‌లో రెండో సీడ్‌ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్‌) 6–7 (5/7), 6–3, 6–4, 6–4తో ఆండ్రీ రబ్లెవ్ (రష్యా)ను ఓడించి క్వార్టర్స్‌ చేరాడు. ఫ్లావియో కొబోలి (ఇటలీ) 6–4, 6–4, 6–7 (4), 7–6 (3)తో మారిన్‌‌ సిలిచ్‌‌ (క్రొయేషియా)పై, షెల్టన్‌ (అమెరికా) 3–6, 6–1, 7–6 (1), 7–5తో సోనెగో (ఇటలీ)పై గెలిచి ముందంజ వేశాడు.