కొండకల్​లో షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాపు దగ్ధం

కొండకల్​లో  షార్ట్ సర్క్యూట్ తో  కిరాణా షాపు దగ్ధం
  • సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం 
  • రంగారెడ్డి జిల్లా కొండకల్ లో ఘటన

శంకర్ పల్లి, వెలుగు: షార్ట్ ​సర్క్యూట్ తో కిరాణ షాపు సామగ్రి కాలిపోగా.. రూ. లక్షల్లో ఆస్తినష్టం జరిగింది. బాధితుడు తెలిపిన ప్రకారం.. శంకర్​పల్లి మండలం కొండకల్​లో గణపతిరెడ్డి కొన్నేండ్లుగా కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి షాపు బంద్​చేశాడు.  శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో  ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్​తో షాపులో మంటలు చెలరేగాయి. స్థానికులు చూసి గణపతి రెడ్డికి చెప్పగా.. ఆయన వెంటనే100కు  కాల్ చేశాడు.

 ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ గచ్చిబౌలి, మాదాపూర్, పటాన్​చెరు, శంకర్​పల్లి స్టేషన్ల పోలీసులు కాలయాపన చేశారు. దీంతో బాధితుడు స్థానికులతో కలిసి నీటిని చల్లి మంటలను ఆర్పారు. అనంతరం ఫైర్​ సిబ్బంది రాగా.. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపు కాలిపోగా.. సుమారు రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వాపోయాడు.  మోకిల పీఎస్​లో  కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.