
బాగల్ కోట్: వధువుకి తాళి కట్టిన కాసేపటికే వరుడు గుండెపోటుతో మరణించారు. దీనిని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదం లో కూరుకుపోయారు. ఈ షాకింగ్ ఘటన శనివారం కర్నాటక బాగల్ కోట్‌లోని జామ్‌ఖండి పట్టణంలో జరిగింది.
వధువుకు తాళి కట్టిన కొన్ని నిమిషాలకే వరుడు ప్రవీణ్(25) కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే స్పందించి ప్రవీణ్‌ను సమీపం లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించా డని డాక్టర్లు తెలిపారు. తేడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లో పెళ్లి వేడుకలో స్టేజీపై సంగీత ప్రదర్శన ఇస్తూ గుండెపోటుతో 23 ఏండ్ల మహిళ మరణించింది.