24 నుంచి వెబ్​సైట్‌‌లో..గ్రూపు 1 ఓఎంఆర్ షీట్లు

24 నుంచి వెబ్​సైట్‌‌లో..గ్రూపు 1 ఓఎంఆర్ షీట్లు

హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను ఈ నెల 24న సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో తమ వివరాలతో  లాగిన్ అయ్యి, తమ ఓఎంఆర్ షీట్లను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. 

ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1కు 4,03,667 అప్లికేషన్లు వచ్చాయని, 3,02,172 మంది పరీక్షకు హాజరయ్యాని పేర్కొంది. ఏయే జిల్లాలో ఎంత మంది పరీక్ష రాశారన్న లెక్కలను వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచామని పేర్కొంది