TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల

TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ విడుదల

హైద‌రాబాద్ : గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ కీ విడుద‌లైంది. తుది కీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. త్వర‌లోనే ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్రక‌టించిన త‌ర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయ‌నుంది టీఎస్‌పీఎస్సీ.

ఈ ఏడాది జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం జూన్‌ 11వ తేదీన పరీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.