
బషీర్‌బాగ్, వెలుగు: గ్రూప్ 1 నియామకాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం గన్‌పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తున్నదని ఫైరయ్యారు. జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ విడుదల చేయలేదని, పాత ఉద్యోగాలను చూపించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.