గ్రూప్ 2 ఫైనల్ లిస్టు.. దసరాలోపు నియామక పత్రాలిచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు

గ్రూప్ 2 ఫైనల్ లిస్టు.. దసరాలోపు నియామక పత్రాలిచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్2 ఫైనల్ లిస్టు రిలీజ్ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)రెడీ అవుతున్నది. ఆదివారం సెలక్షన్ లిస్ట్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నది. ఇందుకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. శనివారం గ్రూప్1 నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో.. గ్రూప్ 2కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా దసరా లోపే నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్​లో రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 2,49,964 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్​కు అటెండ్ అయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మార్చి నెలలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొత్తం 2,36,649 జనరల్ ర్యాకింగ్ లిస్టును వెల్లడించింది.