యథావిధిగా తెలంగాణ గ్రూప్‌2 ఇంటర్వ్యూలు

యథావిధిగా తెలంగాణ గ్రూప్‌2 ఇంటర్వ్యూలు

రాష్ట్రంలో గ్రూప్‌2 ఉద్యోగాల భర్తీకి TSPSC నిర్వహించనున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొసాగనున్నాయి. గ్రూప్‌2 ఇంటర్వ్యూలను నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గానే ఉన్నాయని, అందులో జోక్యం అవసరం లేదని సుప్రీం కోర్టు, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది.