గ్రూప్–2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్

గ్రూప్–2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్: గ్రూప్–2 సర్వీసెస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బిగ్ అప్డేట్ ఇచ్చింది. గ్రూప్–2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది టీజీపీఎస్సీ. 2025, సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను కమిషన్ అధికారిక వెబ్ సైట్‎లో అందుబాటులో ఉంచినట్లు అభ్యర్థులకు సూచించింది. 

వెరిఫికేషన్ వివరాలు

తేదీలు: 2025, సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15 వరకు
 స్థలం: సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ, పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్.
అవసరమైన డాక్యుమెంట్లు: అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన జీరాక్స్ కాపీలను తీసుకురావాలి.

ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం కోసం TGPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యే ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పూర్తి షెడ్యూల్, సూచనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

►ALSO READ | గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో భారీగా ఉద్యోగాలు.. ఫీజు లేదు, డైరెక్ట్ సెలక్షన్.. అప్లయ్ చేసుకోండి