TRSలో భగ్గుమన్న వర్గపోరు

TRSలో భగ్గుమన్న వర్గపోరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో TRS నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకైనా సిద్ధమని పార్టీలోని ఓ వర్గం వార్నింగ్ ఇస్తోంది. ఎమ్మెల్యే హరిప్రియనాయక్ పై .. మాజీ మున్సిపల్ చైర్మన్ మడత రమ, అనుచరులు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గంలో జరిగిన పనులన్నీ.. గతంలోనే మంజూరైనవే అనీ.. వాటిని తామే తెచ్చామంటూ హడావుడిగా శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. మోడల్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, క్రమబద్ధీకరణ.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో తమ హయాంలోనే అయ్యాయని మాజీ మున్సిపల్ చైర్మన్ మడత రమ అన్నారు.

ఇల్లందు ఇంచార్జి కమిషనర్ ఒక వర్గాన్నే సపోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఫ్లెక్సీలు పెట్టొద్దని చెబుతున్న అధికారులు… ఒక వర్గం ప్లెక్సీలు పెడుతుంటే వారికి అడ్డుచెప్పడం లేదని.. అది మంచిది కాదని మడత రమ, మాజీ కౌన్సిలర్లు మండిపడ్డారు. పరిస్థితి మారకుంటే.. అవసరమయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా వెనకాడమంటూ మాజీ కౌన్సిలర్లు తేల్చిచెప్పారు.