
సెలక్ట్ అయి ఏడాదైనా నియామక పత్రాలు ఇవ్వలేదంటూ గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎంపికైన 700 మంది విలేజ్ రెవెన్యూ అధికారులకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ లోని ప్రధాన కమిషనర్ భూ పరిపాలన కార్యాలయం ముందు అభ్యర్థులు నిరసన తెలిపారు. 2018 లో ఎగ్జామ్స్ రాశామని.. మూడు నెలల క్రితం TPSC ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.