కరెన్సీకి పెరుగుతున్న డిమాండ్!

కరెన్సీకి పెరుగుతున్న డిమాండ్!

పెరగనున్న డిమాండ్
వెల్లడించిన ఆర్బీఐ స్టడీ

ముంబై: ఆన్ లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, కరెన్సీకి డిమాండ్ తగ్గదని ఆర్ బీఐ తాజా స్టడీ వెల్లడించింది. ప్రస్తుతం వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కరెన్సీకి డిమాండ్ఎక్కువ అవుతుందని స్పష్టం చేసింది. స్టడీ వివరాలు ఇలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కరెన్సీ నోట్లు చెలామణి అవుతాయి. 2019–20 ఆర్థిక‌ సంవత్సరంలో కార్డు, మొబైల్ పేమెంట్స్ విలువ 10.57 లక్షల కోట్లకు చేరింది. ఏటీఎం విత్ డ్రాయల్స్ విలువ రూ.9.12 లక్షల కోట్ల కంటే వీటి విలువ ఎక్కువ. కరోనా కేసులు మొదలయ్యాక, జనం ఏటీఎంలను వాడటం తగ్గించారు. ‘మోడలింగ్ అండ్ ఫోర్ కాస్టింగ్ కరెన్సీ డిమాండ్ ఇన్ ఇండియా ఏ హెటెరో డాక్స్ అప్రోచ్’ పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ తెలియ జేసింది. ఆన్ లైన్ పేమెంట్స్ ను వీలైనంత పెంచాలని స్పష్టం చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ నెగటివ్ లోకి వెళ్తుందని అంచనాలు ఉన్నాయి. అయినా కరెన్సీ వాడకం పెరగనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో కరెన్సీ చెలామణి విపరీతంగా పెరిగి రూ.2.66 లక్షల కోట్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.

మ‌రిన్ని వార్త‌ల కోసం