పెరుగుతున్న వరద ప్రవాహం : కృష్ణానదిలోకి ఎవరూ వెళ్లకూడదు

పెరుగుతున్న వరద ప్రవాహం : కృష్ణానదిలోకి ఎవరూ వెళ్లకూడదు

నారాయణపూర్ నుంచి విడుదలైన కృష్ణా జలాలు జూరాల జలాశయానికి చేరుకున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్నా, గోదావరి పరివాహక ప్రాంతాలకు వరద పెరిగింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి లక్షా 23వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా.. జూరాలలోకి 35వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. జూరాలకు వరద చేరటంతో.. కృష్ణానదిలోకి ఎవరూ వెళ్లకూడదని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.