అప్పట్లో తెలుగులో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య చిత్రంలో హీరో మరదలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్. అయితే నటి కస్తూరి శంకర్ తమిళ సినీ పరిశ్రమకి చెందిన నటి అయినప్పటికీ మొదట్లో తెలుగులో కూడా అడపదడపా చిత్రాల్లో నటించింది.
కాగా నటి కస్తూరి శంకర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాంట్రవర్సీలలో నిలుస్తోంది. తాజాగా సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి కస్తూరి శంకర్ స్పందించింది. ఇందులో భాగంగా ఓ డైరెక్టర్ తనని అవకాశాలు పేరుతో లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని కానీ తాను మాత్రం అస్సలు లొంగలేదని తెలిపింది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ సమయంలో అందరిముందు ఆ డైరెక్టర్ ని తిట్టడమేకాకండా మరొకరు ఇబ్బంది పడకుండా డైరెక్టర్ నిజస్వరూపం బయటపెట్టానని చెప్పుకొచ్చింది.
అయితే కొంతమంది అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో పని చేసి ఆర్థికంగా సెటిల్ అవ్వాలని, ఫేమ్ సంపాదించుకోవాలని ఇండస్ట్రీకి వస్తుంటారని అలాంటి వాళ్ళని కొందరు అవకాశవాదులు అవకాశాల పేరుతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుంటారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే తనని క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బంది పెట్టిన డైరెక్టర్ పేరు మాత్రం కస్తూరి శంకర్ బయటపెట్టలేదు.
Also Read :- తెలుగు దర్శకుడితో లారెన్స్ 25వ సినిమా
ఇక నటి కస్తూరి శంకర్ కెరీర్ విషయానికొస్తే ఆ మధ్య స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన గృహలక్ష్మి సీరియల్ ద్వారా టాలీవుడ్ బుల్లితెరపై కనిపించింది. ఈ సీరియాల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం కస్తూరి శంకర్ తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తోంది.