Vastu: దసరా ఉత్సవాలు.. ఇల్లు మారినా.. గృహప్రవేశం చేసినా పాటించాల్సిన నియమాలు ఇవే..!

Vastu: దసరా ఉత్సవాలు.. ఇల్లు మారినా.. గృహప్రవేశం చేసినా పాటించాల్సిన నియమాలు ఇవే..!

దసరా నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి.  శారదా నవరాత్రిళ్లు గా చెప్పే దసరా ఉత్సవాల్లో దుర్గాదేవిని పూజిస్తారు. కొంతమంది ఈ సమయంలో ప్రత్యేకంగా గృహప్రవేశం .. ఇల్లు మారడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు.  దసరా ఉత్సవాలు జరిగే సమయంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్దతులు  పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!

విశ్వావశునామ సంవత్సరంలో ( 2025)  శారదా నవరాత్రి ఉత్సవాలు  అక్టోబర్ 2... దసరాపండుగ (  విజయదశమి)  వరకు కొనసాగుతాయి.  నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ( సెప్టెంబర్​ 26)  దుర్గాదేవి ఐదవ రూపమైన మహాలక్ష్మి దేవి రూపంలో  భక్తులకు దర్శనమిచ్చారు.  మహాలక్ష్మి దేవి.. ఐశ్వర్యానికి .. సంపదకు మూలకారణం  . అయితే  కొంతమంది పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరాత్రి ఉత్సవాల్లో కొత్త ఇంటిలోకి ప్రవేశించినా.. గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా మంచిదని చెబుతున్నారు.  తారాబలం.. మంచిరోజు చూసుకొని గృహప్రవేశానికి సంబంధించిన వాస్తు నియమాలను పాటించాలి. 

దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో  గృహప్రవేశం చాలా పవిత్రమైనదని వాస్తు పండితులు చెబుతున్నారు.  ఆశ్వయుజమాసంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు జరిగే  అష్టమి, నవమి , దశమి రోజుల్లో  గృహప్రవేశం చేస్తే చాలా మంచిదని అంటున్నారు. ఆ రోజుల్లో శుభ ముహూర్తాన్ని  చూసుకొని  కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వలన ఆనందం.. శ్రేయస్సు.. సుఖం.. శాంతి లభిస్తాయి. 

వాస్తు శాస్త్రం ప్రకారంగా  గృహప్రవేశం చేసే సమయంలో ఇంట్లో గణపతి హోమం.. నవగ్రహాల హోమం చేయాలి. దీనివలన ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.  హోమం నుంచి వెలుడవడే అగ్నికి..  ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.  ఇంకా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు భార్యభర్తలు ఒకేసారి కుడిపాదం ద్వారా ప్రవేశించాలి దేవుడి పటాలను పట్టుకోవాలి.  ఇలా చేయడం వలన అదృష్టం కలుగుతుందట. 

గృహప్రవేశం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర  మామిడి ఆకులు ..  బంతి పూలతో  చేసిన తోరణాలను కట్టాలి.  ఇంకా ఆ రోజున ఇంటి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్​.. ఓం అనే గుర్తులతో పాటు రంగోలితో లక్ష్మీదేవి పాదముద్రలు  ఉండేలా చూసుకోండి.  దీనివలన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ.. కుబేరుడు స్థిర నివాసంగా ఉంటాడని వాస్తు పండితులు చెబుతున్నారు. 

గృహప్రవేశం రోజున  కచ్చితంగా కొత్త పాత్రలో పాలను పొంగించి.. పాయసం తయారు చేయాలి.  కుటుంబ సంప్రదాయాల ప్రకారం పూజలుచేయాలి. ఇలా చేయడం వలన  ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి, శ్రేయస్సు కలుగుతుంది  .  కొత్త ఇంట్లో పూజ చేసిన తర్వాత, కుటుంబ సభ్యులు మొదటి రాత్రి అక్కడే పడుకోవాలి. ఇంట్లోకి మారిన తర్వాత, కనీసం ఒక నెల పాటు ఆ ఇంటిని ఖాళీగా ఉంచకూడదని పండితులు చెబుతున్నారు.