వెంచర్ల పేరుతో రియల్‌ఎస్టేట్ మోసం: GSR ఇన్ఫ్రా గ్రూప్ పై కేసు

వెంచర్ల పేరుతో రియల్‌ఎస్టేట్ మోసం: GSR ఇన్ఫ్రా గ్రూప్ పై కేసు

హైదరాబాద్: కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్, యాదాద్రి ప్రాంతాల్లో భారీ వెంచర్ల అంటూ ప్రచారం చేసి.. ఫ్రీ లాంచ్ పేరుతో GSR ఇన్ఫ్రా గ్రూప్ అనే సంస్థ కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుండి ఇన్వెస్ట్మెంట్ పేరుతో సంస్థ ఎండి శ్రీనివాసరావు భారీగా పెట్టుబడులు సేకరించాడు. జీఎస్ఆర్ 2020 సంవత్సరం నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. 

మూడు సంవత్సరాలు అయినా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా శ్రీనివాసరావు తప్పించుకొని తిరుగుతున్నారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. గత 3 నెలల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తానంటూ కస్టమర్లకు చెప్తున్నాడు. శ్రీనివాసరావు 2 నెలల నుంచి కనబడకుండా పోవడంతో బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా GSR ఇన్ఫ్రా పై రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కొల్లూరు పీఎస్ లో శ్రీనివాస్ రావుపై కేసు నమోదు చేశారు.