
న్యూఢిల్లీ: గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) స్లాబ్ రేట్లను తగ్గించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, రివ్యూ వర్క్ పూర్తయ్యిందని జీఎస్‌టీ కౌన్సిల్ చైర్‌పర్సన్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ కింద నాలుగు స్లాబ్ రేట్లు 5, 12,18, 28 శాతం ఉన్నాయి. లగ్జరీ గూడ్స్, పొగాకుపై 28 శాతం ట్యాక్స్ వేస్తుండగా, అత్యవసర ప్రొడక్ట్‌లపై 5 శాతం జీఎస్‌టీ పడుతోంది. జీఎస్‌టీ రేట్లను సవరించాలని, స్లాబ్‌లను తగ్గించాలని మినిస్టర్ల గ్రూప్ జీఎస్‌టీ కౌన్సిల్‌కు రికమండ్ చేసింది. జీఎస్‌టీ రేట్లను రేషనలైజ్ చేయడానికి మూడేళ్ల కిందటే పనులు మొదలయ్యాయని సీతారామన్ అన్నారు.