GT vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్ జట్టులో కిల్లర్ మిల్లర్

GT vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్ జట్టులో కిల్లర్ మిల్లర్

రోజులు గడుస్తున్న కొద్దీ ఐపీఎల్ టోర్నీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే లీగ్ దశలో ఏడెమినిది మ్యాచ్‌ల్లో గెలవడం తప్పనిసరి కావడంతో.. అన్నీ జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. ఊహకందని ఫలితాలు రాబడుతున్నాయి. దీంతో అభిమానులకు మంచి మజా దొరుకుతోంది. నేడు అలాంటి రసవత్తర పోరు మరోసారి అంచనా వేయొచ్చు.

నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సమయం గడిచే కొద్దీ మంచు కురిసే అవకాశం ఉండడంతో బౌలింగ్ వైపు మొగ్గుచూపినట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడట్లేదు. పాయింట్ల పట్టికలో టైటాన్స్ 3 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 2 విజయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.

తుది జట్లు

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.