GT vs DC: 30 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో గుజరాత్

GT vs DC: 30 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో గుజరాత్

సొంతగడ్డపై గుజరాత్ బ్యాటర్లకు ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ తొలి 5 ఓవర్లలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సాయి సుదర్శన్‌ (12) రెండెంకెల స్కోర్ చేయగా.. శుభ్‌మన్‌ గిల్(8), వృద్ధిమాన్ సాహా(2), డేవిడ్ మిల్లర్(2) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. 

6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోర్.. 30/4. అభినవ్ మనోహర్(0 నాటౌట్), రాహుల్ తెవాటియా(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకూ ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, ముకేష్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నారు.