RR vs GT Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో మరో హై-వోల్టేజ్ పోరుకు సమయం ఆసన్నమైంది. మే 29న న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడబోతున్నాయ. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో పోటీపడనుంది.
న్యూ చండీగఢ్ రికార్డులు:
ముల్లాన్‌పూర్‌లోని 'మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 38,000గా ఉంది. 2024 నుంచి ఇది పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు అధికారిక హోమ్ గ్రౌండ్‌గా మారిపోయింది.
* పిచ్ రిపోర్ట్: ఇది బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలమైన పిచ్. ఇక్కడ ఇప్పటివరకు 16 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు, ఛేజింగ్ చేసిన జట్లు 8 సార్లు గెలిచాయి.
* రాజస్థాన్ కిరాక్ రికార్డ్: ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాజస్థాన్ రాయల్స్ ఈ మైదానంలో ఆడిన మొత్తం 4 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది
టికెట్లు ఎక్కడ కొనాలి?:
* క్వాలిఫయర్-2 మ్యాచ్ టికెట్లు District by Zomato యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
* టికెట్ ధరలు: స్టాండ్‌లు, సీట్ల లభ్యతను బట్టి టికెట్ ధరలు రూ. 2,250 నుంచి రూ. 17,500 వరకు ఉన్నాయి. కస్టమర్లు తాజా ధరల కోసం డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫారమ్‌ను చెక్ చేసుకోవచ్చు.
టికెట్ బుకింగ్, ఎంట్రీ రూల్స్ ఇవే:
స్టేడియానికి వెళ్లే ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిర్వాహకులు కొన్ని కఠినమైన నిబంధనలను విధించారు.
* టికెట్ల పరిమితి: ఒక ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా 4 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు.. అంతకంటే ఎక్కువ టికెట్లు కావాలనుకుంటే bulkbooking@district.in ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
* రెండేళ్లలోపు వారికి నో టికెట్: అన్ని వయసుల వారికి ప్రవేశం ఉంది. కానీ 2 సంవత్సరాల లోపు ఉన్నవారికి స్టేడియంలోకి వచ్చేందుకు టికెట్ అవసరం లేదు.. రెండు కంటే కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ టికెట్ తప్పనిసరి.
* మైనర్ల పర్యవేక్షణ: 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు కచ్చితంగా టికెట్ కలిగిన పెద్దల (Adult) పర్యవేక్షణలోనే స్టేడియంలోకి రావాల్సి ఉంటుంది.
* గేట్ల ఓపెనింగ్ టైమిండ్: మ్యాచ్ రాత్రి 7:30 కి ప్రారంభమవుతుండగా, స్టేడియం గేట్లు సాయంత్రం 4:00 PM కే ఓపెన్ అవుతాయి. ఎలాంటి రద్దీ లేకుండా ప్రవేశించడానికి ముందే టికెట్లను దగ్గర సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.
* బుకింగ్ టైమర్: టికెట్లు కార్ట్‌లో యాడ్ అయిన తర్వాత బుకింగ్ పూర్తి చేయడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది.
* M-Tickets నిబంధన: టికెట్ కొనుగోలు చేసిన తర్వాత డిజిటల్ టికెట్లను (M-tickets) డౌన్‌లోడ్ చేయడానికి వీలుండదు. ఇవి కేవలం District యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లో మాత్రమే కనిపిస్తాయి. ఎంట్రీ దగ్గర దాన్నే చూపించాలి.
* రీఫండ్ పాలసీ: ఐపీఎల్ టికెట్లు నాన్-కన్సిలబుల్, నాన్-రీఫండబుల్. ఒకవేళ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా పూర్తిగా రద్దయితేనే రీఫండ్ చేయబడుతుంది.
