పర్వతగిరి, వెలుగు: కల్లెడ ఆర్డీఎఫ్ కాలేజీ స్టూడెంట్ గుగులోతు వెన్నెల రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జనార్ధన్ తెలిపారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జోనల్ క్రీడా పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచిందన్నారు.
ఈ నెల 28, 29, 30వ తేదీల్లో సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. వెన్నెలను మంగళవారం ప్రిన్సిపాల్ తోపాటు వైస్ ప్రిన్సిపాల్ రాజు, అకాడమిక్ హెడ్ ప్రవీణ్ తదితరులు అభినందించారు.
