ట్రీట్మెంట్ కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి గైడ్ లైన్స్ 

ట్రీట్మెంట్ కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి గైడ్ లైన్స్ 
  • అంబులెన్సుల్లో పేషెంట్లను పెట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు
  • కోవిడ్ పేషేంట్ల ఆడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరం
  • అందుకే గైడ్ లైన్స్ విడుదల: తెలంగాణ ప్రభుత్వం
  • కాల్ సెంటర్ ఫోన్  నెంబర్లు: 0402465119, 9494438351 

హైదరాబాద్: కరోనా ట్రీట్మెంట్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న వాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం  విధివిధానాలు జారీ చేసింది. అత్యవసరంగా మెరుగైన చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చి.. ఇక్కడ ఏ ఆస్పత్రిలో అడ్మిట్ కాకుండా, అంబులెన్సుల్లో పేషేంట్లను పెట్టుకుని తిరిగుతున్నారు. ఆందోళనకర పరిస్థితుల్లో సహాయం చేయమంటూ తెలిసిన వారినందరినీ అభ్యర్థిస్తూ ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించి అంబులెన్సుల్లో పేషంట్లను పెట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితిని నివారించేందుకు  గైడ్ లైన్స్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ పేషేంట్ల ఆడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని ప్రభుత్వం  స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్లకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ వచ్చే వారు కాల్ సెంటర్ నెంబర్లు: 0402465119 మరియు 9494438351 లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. ఆస్పత్రి నుంచి అడ్మిషన్ ప్రపోజల్ లెటర్ ఉంటే, పేషేంట్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు కంట్రోల్ రూమ్ అనుమతి ఇస్తుంది.