
మీ చేతులు ఉపయోగించకుండా మీ శరీరంపై ఏదైనా పట్టుకోగలరా అది సాధ్యమవుతుందా.. చాలామందికి సాధ్యమయ్యే పనికాదు. కాని ఓ వ్యక్తి మాత్రం తన శరీరంపై ఏకంగా 88 స్పూన్లను బ్యాలెన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో వివరాల్లోకి వెళ్దాం..
ఒకటి లేదా రెండు స్పూన్లు అంటే బాడీపై బ్యాలెన్స్ చేయగలమేమో.. 88 స్పూన్స్ బ్యాలెన్స్ చేయడం అంటే.. అదేం కష్టం కాదని నిరూపించాడు ఓ వ్యక్తి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించడానికి కొందరు చిత్ర విచిత్రమైన నైపుణ్యాలు ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఇరాన్‌కి చెందిన అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ అనే వ్యక్తి తన శరీరంపై అత్యధిక సంఖ్యలో స్పూన్‌లను బ్యాలెన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం కోసం చాలామంది తహతహలాడతారు. వింత వింత టాలెంట్స్ ప్రదర్శిస్తూ రికార్డు సాధిస్తుంటాంరు. రీసెంట్‌గా అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ తన బాడీపై 88 స్పూన్స్ బ్యాలెన్స్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. 2022 లో తన పేరు మీద ఉన్న 85 స్పూన్స్ రికార్డును తిరగ రాశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యాజమాన్యం మొఖ్తారీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అద్భుతమైన బ్యాలెన్సింగ్ నైపుణ్యంతో ఇటీవల సైప్రస్‌కు చెందిన అరిస్టోటెలిస్ వాలారిటిస్ అనే వ్యక్తి తన తలపై 319 వైన్ గ్యాసులను బ్యాలెన్స్ చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. వైన్ గ్లాసులు అమర్చబడిన ట్రేలను ఒక వ్యక్తి అరిస్టోటెలిస్ వాలారిటిస్ తలపై పెడతాడు. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అతను ముందుకు నడిచాడు. చివర్లో గ్లాసులన్నీ నేలపై పడటం కనిపిస్తుంది. కాదేది కవితకనర్హం అన్నట్లు.. కాదేది రికార్డుకి అనర్హం అనుకుంటూ అనేకమంది వినూత్నంగా ఆలోచిస్తూ వింత వింత నైపుణ్యాలు ప్రదర్శిస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నారు.