
గుజరాత్ గోల్‌వాడ సమీపంలో జగన్నాథుని రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. నిర్వాహకులు అక్కడకు తీసుకొచ్చిన ఏనుగు అదుపు తప్పి గందరగోళం సృష్టించింది. దీంత అక్కడ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
జగన్నాథ రథయాత్ర లో ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఇవాళ ( జూన్ 27) చోటుచేసుకుంది. ఒడిశా లోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్‌లోని గోల్‌వాడ లో రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది.
రథయాత్రలో అదుపు తప్పిన ఏనుగు ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో నుంచి తప్పించుకునేందుకు ఎక్కడివారు అక్కడ పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. . వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఏనుగును అదుపు చేశారు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.