గుండెలు అదిరాయ్ : రోడ్డుపై తీరిగ్గా నడుస్తున్న పులి – వర్షంతో పక్కనే ఆగిన వాహనాలు..

గుండెలు అదిరాయ్ : రోడ్డుపై తీరిగ్గా నడుస్తున్న పులి – వర్షంతో పక్కనే ఆగిన వాహనాలు..

కారు కిటికీలోంచి బయటకు చూస్తున్నప్పుడు సింహం మీ వైపుగా వస్తే మీరు ఏం చేస్తారు? ఇలాంటి సిచ్యువేషనే ఎదురైతే.. కళ్లల్లో భయం కాస్తా కాళ్లలోకి చేరుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇటీవల గుజరాత్‌లో వాహనాల రద్దీ మధ్య సింహం నడుస్తూ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రంలోని ఫ్లైఓవర్‌పై 'అడవి రాజు' షికారు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. రాష్ట్రాన్ని తాకిన వర్షపు వాతావరణం మధ్య నెటిజన్లు ఆన్‌లైన్‌లో ఈ ఫుటేజీని పంచుకున్నారు.

ALSO READ:కన్నడ మాట్లాడరాని వారి కోసం కర్ణాటక ఆటో డ్రైవర్ మెసేజ్.. మండిపడుతున్న నెటిజన్లు 

ఈ వీడియోలో రోడ్డుపై కారు, బైక్ వెళుతుండగా సింహం పక్కనుంచే నడుచుకుంటూ వెళుతోంది. సింహం ప్రశాంతంగా వెళుతోంది. చుట్టుపక్కల ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. కానీ రహదారిపై వెళ్లే వాళ్లు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ 13 సెకన్ల నిడివి గల వీడియోకు.. "సింహం గుజరాత్ వరదల నుంచి తనను తాను రక్షించుకుంది. ప్రజలతో పాటు హైవేపై నడుస్తుంది" అని క్యాప్షన్ ను జత చేస్తూ పోస్ట్ చేస్తూ.. ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. మరొకరు ఈ వీడియో గుజరాత్‌లోని జునాగఢ్ ప్రాంతానికి చెందినదని, "వర్షం ఆగిన తర్వాత వనరాజ్ వాకింగ్‌కు వెళ్లాడు" అని రాశారు.

ఇక గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వారం ప్రారంభంలో కురిసిన కుండపోత వర్షం ముగ్గురిని బలిగొంది. ఇప్పటి వరకు దాదాపు 300 మందిని అధికారులు బాధిత ప్రాంతాల నుంచి రక్షించారు.

Gujarat is battered with incessant rains with flood like situation in many cities. Even, King of the Jungle is forced to relocate from it's habitat. Pray to God ? for a speedy recovery and normalisation of the cities affected#GujaratRain #GujaratRains pic.twitter.com/5YORSAJnEN

— Syed Saba Karim (@SyedSabaKarim5) July 23, 2023