కన్నడ మాట్లాడరాని వారి కోసం కర్ణాటక ఆటో డ్రైవర్ మెసేజ్.. మండిపడుతున్న నెటిజన్లు

కన్నడ మాట్లాడరాని వారి కోసం కర్ణాటక ఆటో డ్రైవర్ మెసేజ్.. మండిపడుతున్న నెటిజన్లు

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఒక ఫొటో.. నెటిజన్లను ఆగ్రహం కలిగిస్తోంది. కర్నాటకలో ఎవరూ ఊహించని సందేశంతో కూడిన ఈ ఆటో చిత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్ యూజర్ 'రోషన్ రాయ్' ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ప్రాంతీయ అహంకారంతో ఇలా దురుసుగా ప్రవర్తించకూడదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కర్నాటకలో ఉన్నందున ప్రతి ఒక్కరూ కన్నడ నేర్చుకోవాలని ఈ ఆటో చిత్రంలో ఉంది.  

“మీరు కర్ణాటకలో ఉన్నారు. కాబట్టి కన్నడ నేర్చుకోండి. మీ అహంకార వైఖరిని చూపించొద్దు. మీరు ఇక్కడికి అడుక్కోవడానికి వచ్చారు” అనే ఈ సందేశం ఆటో వెనకాల ఉండడాన్ని ఈ పోస్టులో చూడవచ్చు. ఇది అప్‌లోడ్ చేసినప్పట్నుంచి ఈ చిత్రానికి 8వేల వ్యూస్ వచ్చాయి. దీనికి నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తుండగా.. ఇది ఆమోదయోగ్యం కాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు