CSK vs GT: జూనియర్ మలింగ వచ్చేశాడు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్

CSK vs GT: జూనియర్ మలింగ వచ్చేశాడు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్

ఐపీఎల్ లో నేడు (మార్చి 26) హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా యువ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్ చెన్నై జట్టుకు కెప్టెన్సీ చేస్తుంటే.. శుభమన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపిస్తున్నాడు.

Also Read: జడేజాకు అరుదైన గౌరవం.. ధోనీని పట్టించుకోని చెన్నై ఫ్యాన్స్

ఈ లీగ్ లో తొలి మ్యాచ్ లో గెలిచిన ఇరు జట్లు వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో దూసుకెళ్లాలని భావిస్తున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్ లో హోరాహోరీ ఖాయంగా కనిపిస్తుంది. గుజరాత్ జట్టు ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తీక్షణ స్థానంలో పతిరాణాకు తుది జట్టులో అవకాశం ఇచ్చింది. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): 

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్