బౌలింగ్లో ఇరగదీసిన సన్‌రైజర్స్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన వాషి, సాయి.. SRH టార్గెట్ ఎంతంటే!

బౌలింగ్లో ఇరగదీసిన సన్‌రైజర్స్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన వాషి, సాయి.. SRH టార్గెట్ ఎంతంటే!

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు, ముఖ్యంగా యువ బౌలర్ ప్రఫుల్ హింగే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ (5) ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి త్వరగానే వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో కీలక ప్లేయర్ జోస్ బట్లర్ (7) కూడా హింగే బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సాయి సుదర్శన్, నిశాంత్ సింధు (22) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత, సింధును కమిన్స్ అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ సాయి సుదర్శన్ నిలకడగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో వాషింగ్టన్ సుందర్ ధాటిగా ఆడి జట్టు స్కోరును 160 దాటించాడు. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించి, 164 పరుగుల దగ్గర సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివరి బంతికి తెవాటియ్ ఫోర్ కొట్టడంతో గుజరాత్ 168 పరుగులు చేసింది. ఇక ఆర్మీ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు.