మోహిత్‌‌‌‌ మాయ.. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు గుజరాత్‌‌‌‌ చెక్‌‌‌‌

మోహిత్‌‌‌‌ మాయ.. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు గుజరాత్‌‌‌‌ చెక్‌‌‌‌
  •     7 వికెట్ల తేడాతో గెలుపు
  •     రాణించిన మోహిత్‌‌‌‌ శర్మ, సాయి సుదర్శన్‌‌‌‌, మిల్లర్‌‌‌‌

అహ్మదాబాద్‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌లో రికార్డు స్థాయి పెర్ఫామెన్స్‌‌‌‌ చూపెట్టిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌కు మళ్లీ ఝలక్‌‌‌‌. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా ఫెయిలవ్వడంతో.. ఆదివారం జరిగిన మూడో లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌ చేతిలో ఓడింది. టాస్‌‌‌‌ నెగ్గిన హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 162/8 స్కోరు చేసింది. అభిషేక్‌‌‌‌ శర్మ (29), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (29) టాప్‌‌‌‌ స్కోరర్లు. మోహిత్‌‌‌‌ శర్మ (3/25) దెబ్బకు సన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ కుదేలైంది.

తర్వాత గుజరాత్‌‌‌‌ 19.1 ఓవర్లలో 168/3 స్కోరు చేసి గెలిచింది. డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 44*), సాయి సుదర్శన్‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 45), కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 2  ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 36) చెలరేగారు. తొలి వికెట్‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌ జత చేసి సాహా (25) ఔటైనా, గిల్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌ నిలకడగా ఆడారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ రన్‌‌‌‌రేట్‌‌‌‌ను కాపాడారు. ఈ క్రమంలో రెండో వికెట్‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌ జత చేసి గిల్‌‌‌‌ వెనుదిరిగాడు. 74/2 స్కోరు వద్ద వచ్చిన మిల్లర్‌‌‌‌ మెరుపులు మెరిపించాడు. సాయి కూడా పోటీ పడి రన్స్‌‌‌‌ చేయడంతో థర్డ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 64 రన్స్‌‌‌‌ జతయ్యాయి. 36 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ చేసిన సాయి 17వ ఓవర్‌‌‌‌లో ఔటైనా, విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌ (14*) అండతో మిల్లర్‌‌‌‌ రెచ్చిపోయాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌‌‌కు 30 రన్స్‌‌‌‌ జోడించారు. మోహిత్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

బ్యాటర్లు మెరవలె..

హైదరాబాద్‌‌‌‌ బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మల్చలేకపోయారు. దీనికి తోడు మ్యాచ్‌‌‌‌ మధ్యలో అఫ్గాన్‌‌‌‌ స్పిన్‌‌‌‌ జోడీ నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (1/32), రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (1/33) రెండు కీలక వికెట్లు తీసి భారీ స్కోరును అడ్డుకున్నారు. 4వ ఓవర్‌‌‌‌లోనే  మయాంక్‌‌‌‌  (16) ఔటైనా, హెడ్‌‌‌‌ (19) దూకుడుతో పవర్‌‌‌‌ప్లేలో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ 56/1 స్కోరు చేసింది. కానీ 7వ ఓవర్‌‌‌‌లో నూర్‌‌‌‌ దెబ్బకు హెడ్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడం హైదరాబాద్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌పై ప్రభావం చూపింది.

ఈ దశలో అభిషేక్‌‌‌‌ శర్మ 2 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో బ్యాట్‌‌‌‌ ఝుళిపించినా ఎక్కువసేపు నిలవలేదు. 10వ ఓవర్‌‌‌‌లో మోహిత్‌‌‌‌కు వికెట్‌‌‌‌ ఇచ్చుకున్నాడు. 74/3తో కష్టాల్లో పడిన రైజర్స్‌‌‌‌ను మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (17), క్లాసెన్‌‌‌‌ (24) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. లాంగాన్‌‌‌‌, మిడాఫ్‌‌‌‌లో రెండు భారీ సిక్స్‌‌‌‌లు కొట్టిన క్లాసెన్‌‌‌‌ను14వ ఓవర్‌‌‌‌లో రషీద్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ కొట్టిన వైడ్‌‌‌‌ షాట్‌‌‌‌ను డీప్‌‌‌‌లో రషీద్‌‌‌‌ అందుకోవడంతో మ్యాచ్‌‌‌‌ ఒక్కసారిగా టర్న్‌‌‌‌ అయ్యింది. నాలుగో వికెట్‌‌‌‌కు 34 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఇక 115/4 వద్ద వచ్చిన షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (22), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌కు 28 బాల్స్‌‌‌‌లోనే 45 రన్స్‌‌‌‌ జోడించారు. కానీ లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో మోహిత్‌‌‌‌ .. షాబాజ్‌‌‌‌, సుందర్‌‌‌‌ (0) వికెట్లు తీశాడు. చివరి బాల్‌‌‌‌కు సమద్‌‌‌‌ రనౌటయ్యాడు. ఈ ఓవర్‌‌‌‌లో మూడే రన్స్‌‌‌‌ రావడంతో హైదరాబాద్‌‌‌‌ చిన్న టార్గెట్‌‌‌‌నే నిర్దేశించింది. 

సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్‌‌‌‌: 20 ఓవర్లలో 162/8 (అభిషేక్‌‌‌‌ 29, సమద్‌‌‌‌ 29, మోహిత్‌‌‌‌ 3/25).

గుజరాత్‌‌‌‌: 19.1 ఓవర్లలో 168/3 (సాయి 45, మిల్లర్‌‌‌‌ 44*, షాబాజ్‌‌‌‌ 1/20).