గులాబ్ బీభత్సం.. ఏపీలో భారీ వర్షాలు,ఈదురుగాలులు

గులాబ్ బీభత్సం.. ఏపీలో భారీ వర్షాలు,ఈదురుగాలులు

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రత కాస్త తగ్గినా వర్షం తగ్గడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. సహాయకబృందాలు చెట్లను తొలగించి రోడ్లు క్లియర్ చేశాయి. రోడ్లు, ఖాళీ ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో జల్లెర వాగుపై నిర్మించిన కల్వర్లు కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

వైజాగ్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి పూర్తిగా నీట మునిగింది. తుఫాన్ ఎఫెక్ట్ తో చాలా ఏరియాల్లో పంట నష్టం జరిగింది. అరటి, కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. అటు రాత్రి కురిసిన వర్షం కారణంగా... నర్సాపురంలో బడ్డీ కొట్టు వరదకు కొట్టుకుపోయింది. రోడ్డుపై దాదాపు 8 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది. అటు భారీ వర్షాలతో ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు అధికారులు... జిల్లాల్లో పరిస్థితులపై ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.