గులాబ్ తుఫాన్.. మూడు రోజులు హైదరాబాద్ లో హై అలర్ట్

గులాబ్ తుఫాన్.. మూడు రోజులు హైదరాబాద్ లో హై అలర్ట్
  • రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు.. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా చర్యలు
  • ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు క్యాన్సిల్

హైదరాబాద్: గులాబ్ తుఫాను నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. రిలీఫ్ క్యాపులు ఏర్పాటు చేయడంతోపాటు.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండే చర్యలు ప్రారంభించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ తన సిబ్బంది, ఉద్యోగులకు సెలవులన్నీ రద్దు చేసింది. వాతావరణ విపత్తుల బృందాలు, సిబ్బందిని అప్రమత్తం చేశారు అధికారులు. 
గతేడాది అనుభవాలు దృషిలో ఉంచుకొని వరద సహాయానికి బోట్స్, పంపులు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అవసరమయ్యే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాలు.. నీట మునిగే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు. వర్ష ప్రభావాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు ఎప్పటికప్పుడు ముందస్తు సూచనలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.