ఫ్లైట్ లో గుండెపోటుతో కోరుట్ల వాసి మృతి

ఫ్లైట్ లో గుండెపోటుతో కోరుట్ల వాసి మృతి

కోరుట్ల,వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగొస్తూ చనిపోయాడు. మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ ప్రకాశం రోడ్డు కాలనీకి చెందిన శ్రీరాముల శ్రీధర్ (46) కొన్నేండ్ల కింద సౌదీ అరేబియాకు వెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం సౌదీ నుంచి ఫ్లైట్ లో  హైదరాబాద్​కు వస్తున్నాడు. ఫ్లైట్ లో అతనికి గుండెనొప్పి వచ్చి అస్వస్థతకు గురై బాధపడుతూ సిబ్బందికి తెలిపాడు.

 ఎమర్జెన్సీగా ఫ్లైట్ ను ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. డాక్టర్లు సీపీఆర్ చేసినా ఫలితం లేదు. శ్రీధర్ చనిపోయినట్లు నిర్ధారించారు. డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. గురువారం సొంతూరుకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు. కడసారి చూపునకు నోచుకోకుండానే శ్రీధర్ చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.