
ఎంపీ కవిత చొరవతో స్వదేశం చేరుకున్న గల్ఫ్ బాధితుడు నిజామాబాద్, వెలుగు: ఉపాధి కోసం పదేళ్ల క్రితం గల్ఫ్ బాట పట్టిన ఓ
వ్యక్ తి ఎంపీ కవిత చొరవతో ఇంటికి చేరాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెం గల్పాడ్ గ్రామానికి చెందిన మలావత్ శ్రీను అనే గిరిజనుడు ఉపాధి కోసం2008లో దుబాయి వెళ్లా డు.ఆరు నెలల వయసున్న కూతురును, భార్యను వదిలి వెళ్లా లని లేకున్నా, ఆర్థిక ఇబ్బం దులు ఆయనను దుబాయికి నెట్టేశాయి. ఎడారి దేశం దుబాయ్ లో మూడు సంవత్సరాలు పని చేశాడు.
మంచి జీతం అంటూ ఓ దళారి మాయమాటలు చెప్పి ఒమన్ దేశానికికు పంపిం చాడు. అక్కడ రెండు నెలలు పని చేసి తర్వాత అక్కడి నుం చి ఇరాన్ దేశం చేరుకున్నాడు . ఇరాన్‌లో రెండు సంవత్సరాలు పనిచేసిన అతడికి కంపెనీ పనికి తగ్గ
జీతం ఇవ్వలేదు. దాం తో అక్కడ నుం చి ఇరాక్ దేశం వెళ్లా డు. ఐదేళ్ల పాటు ఇరాక్ లోనే ఉన్నాడు .ఈ క్రమంలో ఓ రోజు పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంలో తుంటికి తీవ్ర గాయమై ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యాడు. తన పాస్‌పోర్ట్
దుబాయ్ లో ఉన్న దళారీ వద్ద ఉంది. శ్రీను వద్ద ఒక్క గుర్తిం పు కార్డు కూడా లేదు. దీంతో ఎక్కడికి వెళ్లా లో, ఎవరిని సంప్రదిం చాలో తెలియక నానా ఇబ్బం దులు పడ్డాడు . ఇరాక్ లో పడుతు న్నకష్టాలను కుటుం బ సభ్యులకు తెలపడంతో వారు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవరన్‌ను సంప్రదించారు. ఆయన తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారితో బాధిత కుటుం బాన్ని కలిపిం చారు. వివరాలన్నీ తెలుసుకున్న ఆచారి ఈ సమస్యను ఎంపీ కవిత దృష్టికి
తీసుకువెళ్లా రు. ఆమె ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని భారత రాయబార ఆఫీస్ అధికారులతో భారత విదేశాం గ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో మాట్లా డి సహాయం కోరారు. ఎంబసీ అధికారుల సాయంతో 20 రోజుల్లోనే మలావత్ శ్రీను స్వదేశానికి చేరుకున్నాడు . ఇంటికి సురక్షితంగా చేరుకున్న శ్రీనును సోమవారం తెలంగాణ జాగృతి నేతలు కలిశారు. తన బిడ్డను మళ్లీ చూస్తాననుకోలేదని కంటతడి పెట్టాడు .