Kane Williamson: రిటైర్మెంట్ ఇవ్వడు.. మ్యాచ్‌లు ఆడడు: న్యూజిలాండ్ క్రికెట్‌కు తలనొప్పిగా మారిన విలియమ్సన్

Kane Williamson: రిటైర్మెంట్ ఇవ్వడు.. మ్యాచ్‌లు ఆడడు: న్యూజిలాండ్ క్రికెట్‌కు తలనొప్పిగా మారిన విలియమ్సన్

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాపై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన కేన్.. 7 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. మూడు ఫార్మాట్ లు ఆడుతున్న విలియంసన్ జట్టులో లేకపోవడం కివీస్ కు మైనస్ గా మారుతోంది. ఈ స్టార్ బ్యాటర్ ఏ టోర్నీ ఆడతాడో క్లారిటీ ఉండడం లేదు. సోమవారం (అక్టోబర్ 13) ఇంగ్లాండ్ తో ప్రకటించిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు విలియంసన్ ఆడనని తన నిర్ణయాన్ని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో కేన్ పై క్లారిటీ లేకపోవడం కివీస్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. 

విలియంసన్ రీ ఎంట్రీపై న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "విలియంసన్ ప్రపంచ స్థాయి ఆటగాడు. ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు అందుబాటులో లేకపోయినా ఇంగ్లాండ్‌తో జరిగే వన్డేలతో పాటు ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు సిద్ధంగా ఉంటాడని మేము ఆశిస్తున్నాము". అని వాల్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యాబ్-4 ఆడుతున్న వారిలో విలియంసన్ ఒక్కడే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. కోహ్లీ ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. రూట్, స్మిత్ టీ20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నారు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ కేన్ వద్దనుకున్నారు. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉంటే జాతీయ జట్టు తరపున రెగ్యులర్ ప్లేయర్ గా ఆడాల్సి ఉంటుంది. విలియంసన్ మాత్రం అంతర్జాతీయ టీ20 క్రికెట్ లీగ్ లు ఆడాలనే తన కోరికను తెలిపాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో లేకపోయినా ప్రధాన టోర్నీలకు అందుబాటులో ఉంటానని గతంలోనే కేన్ స్పష్టం చేశాడు. విలియంసన్ టీ20 వరల్డ్ కప్ 2026 ఆడతాని ప్రకటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఐసీసీ టోర్నీలో ఫిట్ గా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ కివీస్ దిగ్గజం చెప్పినా ద్వైపాక్షిక సిరీస్ పై ఆసక్తి చూపించడం లేదు. 

న్యూజిలాండ్ కు కేన్ విలియమ్సన్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఎన్నో ఐసీసీ టోర్నీల్లో కివీస్ కు నాయకత్వం వహించాడు. 2021 లో ఇండియాపై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిపించిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎన్నో సార్లు ఫైనల్ కు తీసుకెళ్లాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో  పేలవ ప్రదర్శన దృష్ట్యా  పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకున్నాడు. విలియమ్సన్ 91 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లకు కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కాలంలో కివీస్ జట్టు 47 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు గెలిచింది.  

ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం న్యూజిలాండ్ టీ20 జట్టు:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్)