
జీవితం ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో.. ఎలా శిక్షిస్తుందో ఊహించడం కష్టం. కొన్ని సార్లు విధి పగబట్టినట్లుగా కొందరి జీవితాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ చరిత్రలో అలా బలైనవాళ్లు ఎందరో. ఆ కోవకు చెందిన అభాగ్యుడి స్టోరీనే ఇది. అన్నీ కోల్పోయి.. చేయని నేరానికి దాదాపు జీవిత కాలం మొత్తం శిక్ష అనుభవించిన ఒక భారతీయుడి స్టోరీ ఇది. యవ్వనం మొత్తం జైలు ఊచల వెనక కరిపోయాయి. పెళ్లి చేసుకుని పిల్లలతో కుటుంబ బాధ్యతలతో గడపాల్సిన సమయం జైలు గోడల నడుమ గడిచిపోయింది. మనుమండ్లను ఎత్తుకోవాల్సిన వయసులో జైలు నుంచి రిలీజైన ఈ అభాగ్యుడి విషాద గాథ గురించి తెలుసుకుంటే గుండె కరుగుతున్న ఫీలింగ్ రాక తప్పదు.
భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యం వేదం అలియాస్ సుబ్బు వేదం అనే వ్యక్తి 64 ఏళ్ల వయసులో జైలు నుంచి విడుదలయ్యాడు. పెన్సుల్వేనియాలోని హంటింగ్డన్ పరివర్తన కేంద్రం నుంచి అక్టోబర్ 03 న రిలీజ్ అయ్యాడు. మర్డర్ కేసులో ఆరోపణలతో 19 ఏళ్ల వయసులో జైలుకెళ్లిన సుబ్బు.. ఎలాంటి హత్య చేయలేదని, నేరం రుజువు కాలేదని నాలుగు దశాబ్దాలు.. అంటే 43 ఏళ్లు జైళ్లోనే గడిచిన తర్వాత రిలీజ్ చేశారు. అయితే రిలీజైన వెంటనే యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం పెద్ద ట్విస్టుగా మారింది.
జైలుకు ఎందుకెళ్లాడు..?
సుబ్బు వేదం.. అమెరికాలో సెటిల్ అయిన భారత సంతతి కుటుంబంలో జన్మించాడు. 1980 లో పెన్సుల్వేనియాలో జరిగిన కాల్పుల కేసులో జైలుకు వెళ్లాడు. సుబ్బు క్లాస్ మేట్ అయిన కిన్సేర్ స్టేట్ కాలేజ్ లో కాల్పులకు గురై చనిపోయాడు. అయితే కిన్సేర్ తో చివరిగా ఉన్నది సుబ్బు వేదం అని.. అతన్ని అరెస్టు చేశారు. తప్పు చేయలేదని వాదించినా.. ఒకసారి 1983లో అరెస్టు చేసి.. మళ్లీ 1988లో మరోసారి హత్యారోపణల కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు ఎలాంటి పెరోల్ లేకుండా లైఫ్ అంతా జైళ్లోనే గడపాల్సి వచ్చింది సుబ్బు వేదంకు.
అయితే ఆగస్టు 2025లో సెంటర్ కోర్టు జడ్జి జొనాథన్ గ్రైన్.. సుబ్బు కేసును పరిశీలిస్తూ.. కుట్ర పూరితంగా ఈ కేసులో ఇరికించినట్లు గమనించారు. FBI రిపోర్టు ప్రకారం.. 0.25-క్యాలిబర్ గన్ తో కిన్సేర్ తలలో కాల్చారని.. ఆ ఎవిడెన్స్ అప్పుడు దొరికిందా.. సుబ్బు కాల్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇది కేవలం కాలయాపన చేస్తూ కొనసాగిస్తున్న కేసుగా అభివర్ణిస్తూ సుబ్బును విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో దాదాపు 40 ఏళ్ల జైలు జీవితం నుంచి సబ్బు బయటపడ్డాడు.
►ALSO READ | పాకిస్తాన్ లో సైన్యం కాల్పులు : వందల మంది నిరసనకారులు, పోలీసులు చనిపోయారు..
జైలు నుంచి విడుదలయ్యే వాళ్లు గంపెడన్నీ ఆశలతో బయటకు వస్తారు. కానీ సుబ్బుకు అవేవీ మిగలలేదు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. అతని తల్లి ప్రతి వారం జైలుకు వెళ్లి కొడుకును కలిసి వచ్చేది. అలా 34 ఏళ్ల తర్వాత 2016 లో చనిపోయారు. తండ్రి ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్.. 2009 సెప్పెంబర్ లో కనుమూశారు. అయితే తనకు అక్కడ జైలు చీకటి జ్ఞాపకాలు తప్ప మరేవీ మిగలలేదని.. చివరి రోజులు ప్రశాంతంగా గడుపుదామంటే.. ఇమ్మిగ్రేషన్ కేసులో అమెరికా నుంచి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటం దారణంగా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. డిపోర్టేషన్ ద్వారా ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా మోషన్ పిటిషన్ వేశారు సుబ్బు వేదం లీగల్ టీమ్.. . అతనికి రీహాబిలిటేషన్ కోసం.. ఇమిగ్రేషన్ రూల్స్ వర్తించకుండా అనుమతించాలని చట్టపరంగా పోరాడుతున్నారు.
జైళ్లో స్టూడెంట్ నెంబర్ 1 స్టోరీ:
జైలు జీవితంపై సుబ్బు వేదం ఎప్పుడూ కుంగిపోలేదు. అక్కడ ఉండి ఎన్నో విజయాలను సాధించినట్లు అతని సోదరి సరస్వతీ వేదం తెలపింది. జైళ్లో ఎంతో మందికి విద్య నేర్పించాడు. చాలా మంది డిప్లొమా పూర్తి చేసేలా శిక్షణ ఇచ్చాడు. జైల్లో ఉంటూనే మూడు డిగ్రీలు పూర్తి చేశాడు. ఎంబీఏ పూర్తి చేశాడు. పెన్సుల్వేనియా 150 ఏళ్ల జైలు చరిత్రలో జైళ్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన ఏకైక ఖైదీగా చరిత్ర సృష్టించాడు.
అయితే జైలు నుంచి విడుదలైన వెంటనే పోలీసులు అరెస్టు చేయడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసినట్లు వారు చెప్పారు. 1980 లో వేదం డ్రగ్స్ తీసుకున్నాడని.. సరఫరా చేశాడనే కేసులో అరెస్టు చేయడం విస్మయానికి గురి చేసిందని అంటున్నారు. జీవితంగా జైలు జీవితం గడిపిన అతడిపై రుజువు కాని పాత కేసును రీఓపెన్ చేయడం దారుణం అని బాధపడుతున్నారు.