
పాకిస్తాన్‌లో అల్లర్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇవాళ సోమవారం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (టిఎల్‌పి) మద్దతుదారులు పోలీసులతో ఘర్షనకు దిగారు. దింతో ఈ ఘర్షణలో ఒక పోలీసు ఆఫీసర్ సహా చాలా మంది నిరసనకారులు చనిపోయారు. అయితే ఈ కవాతు పాలస్తీనాకు మద్దతుగా జరిగింది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్తుండగా టిఎల్‌పి మద్దతుదారులు, పోలీసులు మధ్య జరిగిన ఘర్ణణ వల్ల నగరం మొత్తం ఒక్కసారిగా ఉగిపోయింది. అయితే పంజాబ్ పోలీసులు రాత్రి సమయంలో మురిడ్కేలో టిఎల్‌పి నిరసనకారులపై విరుచుకుపడ్డారు. దీంతో పెద్ద గొడవ చెలరేగి, చాలా మంది నిరసనకారులు చనిపోగా కొందరు గాయపడ్డారు. పార్టీ ప్రముఖుడు సాద్ హుస్సేన్ రిజ్వీ ఆధ్వర్యంలో ఈ ఇస్లామిస్ట్ బృందం లాహోర్ నుండి మార్చ్ చేస్తుండగా, భద్రతా సిబ్బంది కర్రలతో కొట్టి, టియర్ గ్యాస్ వదిలింది.
సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, 100 మందికి పైగా చనిపోగా, వేల మంది గాయపడ్డారు. ఈ దాడి ఒక పోలీసు ఆఫీసర్ కూడా చనిపోయారు. నిరసనకారులే తమపై కాల్పులు జరిపారని, అందులో ఒక పోలీసు ఆఫీసర్ చనిపోగా, మరికొందరు గాయపడ్డారని పంజాబ్ పోలీస్ చీఫ్ చెప్పారు. అయితే నిరసనకారుల మరణాల గురించి మాట్లాడలేదు, కానీ టిఎల్‌పి మద్దతుదారులు చాలా మంది చనిపోయారు, గాయపడ్డారని ప్రకటించారు.
ALSO READ : రెండేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయవులు..
అంతేకాకుండా పాకిస్తాన్ పోలీసులు, రేంజర్లు నిరసనకారులపై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటికి వచ్చాయి. ఈ దాడిలో టిఎల్‌పి లిడర్ సాద్ హుస్సేన్ రిజ్వీపై కూడా పోలీసులు కాల్పులు జరిపారని టిఎల్‌పి తెలిపింది. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో టిఎల్‌పి లిడర్ కు చాలా బుల్లెట్ గాయాలు అయ్యాయని, ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని కూడా తెలుస్తోంది.
రిజ్వీపై కాల్పులు జరిపారనే వార్తలు రాకముందు, టిఎల్‌పి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆయన భద్రతా దళాలను కాల్పులు ఆపమని కోరుతూ, మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం కనిపిస్తుంది. రిజ్వీ తన మద్దతుదారులతో మాట్లాడుతుండగా వెనుక నుంచి ఈ కాల్పుల శబ్దం వినిపించింది.