
రెండేళ్ల తర్వాత వాళ్లు వెలుగును చూస్తున్నారు. హమాస్ చెరలో చీకటి గుహల్లో, గదుల్లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు.. ఎట్టకేలకు సోమవారం (అక్టోబర్ 13) విడుదలయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 20 మంది బంధీలను రెడ్ క్రాస్ కు అప్పగించింది హమాస్.
రెండు దశల్లో బంధీల విడుదల:
బంధీలను రెండు దశల్లో విడుదల చేసింది హమాస్ గ్రూప్. మొదట ఏడు మందిని సోమవారం ఉదయం రిలీజ్ చేసిన హమాస్.. ఆ తర్వాత మరో 13 మందిని మధ్యాహ్నం విడుదల చేసింది. రెండేళ్ల భఈకర యుద్ధం తర్వాత పౌరులు స్వేచ్ఛా వాతావరణంలోకి అడుగుపెడుతున్నారు.
ఈజిప్టులో గాజా శాంతి సదస్సు (గాజా పీస్ సమ్మిట్) లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అంతకు ముందు ఇజ్రాయెల్ చేరుకున్నారు. సీజ్ ఫైర్ కోసం మధ్యవర్తిత్వం వహించిన ట్రంప్.. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
ALSO READ : ఇండియాలో రూ.15వేల కోట్లు పెట్టుబడి ప్రకటించిన ఫాక్స్‌కాన్..
కాల్పుల విరమణకు హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించిన తర్వాత.. యుద్ధం ముగిసింది. ఇది చాలా గొప్ప రోజు. ఇది మరో కొత్త అధ్యాయం.. అంటూ సీజ్ ఫైర్ ను ఆహ్వానించారు ట్రంప్. ఆయుధాలను వీడేందుకు కూడా హమాస్ సహకరిస్తుందని భావిస్తున్నానని ఈ సందర్భంగా అన్నారు ట్రంప్.
హమాస్ రిలీజ్ చేసిన వారిలో ఎయిటన్ మోర్, గలి, జివ్ బర్మన్, మతన్ అంగ్రెస్ట్, ఓమ్రి, గుయ్ గిల్బోవా, ఎలాన్ అహెల్ ఉన్నట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
19 వందల మంది పాలస్తీనా బంధీలకు బదులుగా..
సీజ్ ఫైర్ లో భాగంగా ఇటు హమాస్, అంటు ఇజ్రాయెల్ తమ చెరలో ఉన్న బంధఈలను విడుల చేసేందుకు అంగీకరించాయి. హమాస్ 20 మందిని రిలీజ్ చేస్తుండగా.. పాలస్తీనాకు చెందిన 19 వందల మంది పౌరులను ఇజ్రాయెల్ విడుల చేస్తోంది.