
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్( SSC) యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22.
పోస్టుల సంఖ్య: 05 (యంగ్ ప్రొఫెషనల్స్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ బేసిక్స్లో ఏడాది డిప్లొమా కోర్సుతోపాటు ఎంఎస్ ఆఫీస్లో ప్రావీణ్యం ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీసం ఆరు నెలలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 09.
లాస్ట్ డేట్: అక్టోబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.