గద్వాల టౌన్, వెలుగు : హాస్టల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పెర్ నరసింహ, వీవీ నరసింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమశాఖ ఆఫీసర్ నుషితను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులకు 17 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
