జోగులాంబ జాతర సక్సెస్ చేయాలి : జోగులాంబ సేవా సమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్

జోగులాంబ జాతర సక్సెస్ చేయాలి : జోగులాంబ సేవా సమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్
  •     జోగులాంబ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసులు 

అలంపూర్, వెలుగు : జోగులాంబ జాతరను విజయవంతం చేయాలని జోగులాంబ సేవా సమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం అలంపూర్ లోని హరిత హోటల్​లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న వసంత పంచమిని పురస్కరించుకుని జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనంలో భాగంగా జోగుళాంబ జాతరను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ దేవతల వేషధారణతో అష్టభుజి గంటలేశ్వరస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి గాంధీ చౌక్ పోలీస్ స్టేషన్ మీదుగా జోగులాంబ అమ్మవారి ఆలయానికి చేరుకోనున్నట్లు తెలిపారు. 

గంటలేశ్వర ఆలయం తరఫున అమ్మవారికి పంచామృతాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సమితి ఉపాధ్యక్షుడు వెం కన్న బాబు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్, శివానందస్వామి, వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షడు బుజ్జి, ప్రధాన కార్యదర్శి సంజీవనాయుడు, మాధవి మాత, రాజశేఖర్ శర్మ, వాసవీ సత్రం అధ్యక్షుడు రమేశ్ గుప్తా, కేకే సత్యం, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.