నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పది పాసైతే చాలు... తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పది పాసైతే చాలు... తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్,  ఫీల్డ్ అసిస్టెంట్, ​టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్,  ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి మొదలుకుని బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13.

ఖాళీలు: 859. 
విభాగాల వారీగా ఖాళీలు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-–III 35, జూనియర్ అసిస్టెంట్ 159, టైపిస్ట్ 42,  ఫీల్డ్ అసిస్టెంట్ 61, ఎగ్జామినర్ 49, కాపీయిస్ట్ 63, రికార్డ్ అసిస్టెంట్36, ప్రాసెస్ సర్వర్ 95, ఆఫీస్ సబార్డినేట్359. 
వయోపరిమితి : (2026, జులై 1 నాటికి) 18 నుంచి 46 ఏండ్ల మధ్యలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎలిజిబిలిటీ

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు షార్ట్​హ్యాండ్, టైప్‌ రైటింగ్‌లో టెక్నికల్ అర్హత కలిగి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్​లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఫీల్డ్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
టైపిస్ట్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్​తోపాటు ఇంగ్లిష్ టైప్‌ రైటింగ్​లో హయ్యర్ గ్రేడ్ పూర్తిచేసి ఉండాలి.
ఎగ్జామినర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కాపీయిస్ట్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్​తోపాటు ఇంగ్లిష్ టైప్‌ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ (డబ్ల్యూపీఎం 45 పదాలు) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
రికార్డ్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదో తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
ప్రాసెస్ సర్వర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి పూర్తిచేసి ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో వంట, వడ్రంగం, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ మొదలైన వాటిలో 
తమకు ఉన్న పని అనుభవాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. 
ఆఫీస్ సబార్డినేట్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏడు – పదో తరగతి పూర్తిచేసి ఉండాలి. అయితే, పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులను అర్హులుగా పరిగణించరు.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 24. 
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ బీసీ రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు రూ.400. 
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 13. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంగ్లిష్​ షార్ట్​హ్యాండ్, ఇంగ్లిష్ టైపింగ్​లో స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2026, ఏప్రిల్. 
పూర్తి వివరాలకు tshc.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

ఎగ్జామినేషన్ ప్యాటర్న్

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III: క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీని పరిశీలించిన తర్వాత అభ్యర్థులను స్కిల్ టెస్టుకు అనుమతిస్తారు. స్కిల్ టెస్టులో భాగంగా ఇంగ్లిష్​ షార్ట్​హ్యాండ్​లో 120 డబ్ల్యూపీఎం వేగంతో (ఐదు నిమిషాల సమయంలో) పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత  ట్రాన్స్​క్రిప్షన్‌ను 45 నిమిషాల్లోపు కంప్యూటర్ల పైన చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్ టెస్టుకు 100 మార్కులు కేటాయించారు. 


జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్: ఈ నాలుగు పోస్టులకు ఎగ్జామినేషన్​ సిలబస్ ఒకే విధంగా ఉన్నది.  కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ప్రశ్నపత్రం స్థాయి కనీస విద్యార్హతకు అంటే గ్రాడ్యుయేషన్​ స్థాయిలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ 60 ప్రశ్నలు 60 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు 40 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాలి. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లిష్​, తెలుగు భాషల్లో ఇస్తారు. 


 టైపిస్ట్: కంప్యూటర్​ను ఉపయోగించి నిర్వహించే ఇంగ్లిష్ టైప్‌ రైటింగ్ పరీక్ష (నిమిషానికి 45 పదాల వేగంతో) 10 నిమిషాలపాటు ఉంటుంది  ఈ స్కిల్ టెస్టుకు 100 మార్కులు కేటాయించారు.


ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్: ఈ పరీక్ష ఆఫ్​లైన్​లో ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలో ఉంటుంది. మొత్తం 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 45 ప్రశ్నలు 45 మార్కులకు ఉంటుంది. 

ఈ ఎగ్జామ్ లో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులను జిల్లాల వారీగా ఖాళీల ఆధారంగా 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మౌఖిక ఇంటర్వ్యూ (వైవా--వోస్)కు 5 మార్కులు ఉంటుంది.

కనీస అర్హత మార్కులు

ఈ ఎగ్జామ్​లో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

వెయిటేజీ

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు , తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థ,  తెలంగాణ హైకోర్టు న్యాయ సేవా కమిటీ, తెలంగాణ న్యాయ పరిపాలన, అధీన సేవ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, రాష్ట్రంలోని మండల న్యాయ సేవా కమిటీల్లో ప్రస్తుతం కాంట్రాక్ట్ లేదా అవుట్‌ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న అభ్యర్థులకు, వారు అందించిన సేవా కాలాన్ని అనుగుణంగా వెయిటేజీ మార్కులు ఇస్తారు.